News October 17, 2024
తడ వద్ద తీరం దాటిన వాయుగుండం
ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలను భయపెట్టిన వాయుగుండం నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. కాసేపటి క్రితం తడ వద్ద వాయుగుండం తీరాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు. ఈక్రమంలో నిన్న రాత్రి నుంచి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వాయుగుండ బలహీన పడినప్పటికీ ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
Similar News
News November 5, 2024
8న వెంకటాచలంలో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే
సర్వేపల్లి నియోజకవర్గం చెముడు గుంటలోని శిరిడిస్ కళ్యాణ మండపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీల కోసం శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటచలం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత ఆయన అర్జీదారుల నుంచి 550 పైగా అర్జీలు స్వీకరించారు.
News November 4, 2024
పంచాయతీ సెక్రటరీ లైంగిక వేధింపులపై నెల్లూరు SPకి ఫిర్యాదు
లైంగికంగా వేధిస్తున్నాడని పంచాయతీ సెక్రటరీపై ఓ గిరిజన మహిళ SPకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు వివరాల ప్రకారం.. రాపూరు పంచాయతీలోని కోడూరుపాడుకు చెందిన ఓ గిరిజన మహిళ తన తండ్రి చనిపోవడంతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ చెంచయ్యను కోరింది. ఆయితే ఆయన తనతో వీడియో కాల్ మాట్లాడాలని, తన కోరిక తీర్చితే డెత్ సర్టిఫికెట్ 5 నిమిషాల్లో ఇస్తానని వేధించాడని చెప్పింది. సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
News November 4, 2024
నెల్లూరు: బాలిరెడ్డిపాలెంలో విషాదం.. బాలుడు మృతి
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బాలిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన చరణ్(14)ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు బాలుడిని బాలిరెడ్డిపాళెం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి మూసేసి ఉంది. గూడూరుకి తరలించేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకాలంలో వైద్యం అందుంటే బతికుండేవాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.