News February 8, 2025

తడ : హైవేపై ప్రమాదం

image

తడ మండలం కొండూరు హైవేపై ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట వైపు నుంచి తడ వైపు బైక్‌పై వెళుతున్న సినోఫర్ మహమ్మద్ (నెల్లూరు), జ్యోతి బాబే (గుమ్మిడిపూడి) అనే ఇద్దరు యువకులు ముందు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన తడ హైవే మొబైల్ వాహనం సహాయంతో సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.

Similar News

News February 12, 2026

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

image

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.

News February 12, 2026

MBNR: PMను కలిసే అవకాశం.. రిజిస్ట్రేషన్ చేసుకోండి

image

నూతన బడ్జెట్‌పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ప్రతిభకనబరిచిన యువతి, యువకులు జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానిని కలిసి మాట్లాడే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, ఆసక్తి గల యువత ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. Site:https://mybharat.gov.in

News February 12, 2026

ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు!

image

TG: మున్సిపల్ ఫలితాలు వెల్లడికాక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. తమకు మెజార్టీ వచ్చే స్థానాల్లోని అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. BRS MLA జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి అభ్యర్థులను HYD శివార్లలోని రహస్య ప్రాంతానికి తరలించారు. మంచిర్యాల నుంచి తడోబాకు, ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బీజేపీ అభ్యర్థులను తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.