News September 12, 2024
తణుకులో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు
జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు తణుకు డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఛైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ తెలిపారు. అథ్లెటిక్స్ పోటీలను అసోసియేషన్ సెక్రటరీ సంకు సూర్య నారాయణ, అధ్యక్షుడు చింతకాయల సత్య నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారిస్ ఒలింపిక్స్ వరకు వెళ్లిన దండి జ్యోతిక శ్రీని ఘనంగా సత్కరించారు.
Similar News
News October 9, 2024
విజయవాడ -శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
దసరా పండగ సందర్భంగా ఈ నెల 9, 10, 11, 12, 14, 15 తేదీల్లో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు- విజయవాడకు ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు తిరుగుతాయన్నారు. ఏలూరు, గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, విజయనగరం, చీపురుపల్లి, మీదుగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు.
News October 9, 2024
తాడేపల్లిగూడెం: జాతీయ స్థాయి యోగాసన పోటీలకు చంద్రశేఖర్ ఎంపిక
రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరిగిన సంప్రదాయ యోగాసన పోటీల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించడం ద్వారా మైసూర్‌లో నవంబర్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలు ఎంపికైనట్లు వివరించారు. ఆయనను దండగర్ర జడ్పీహెచ్ హెచ్ఎం సీహెచ్. చంద్రశేఖర్ అభినందించారు.
News October 8, 2024
తణుకు: స్నానానికి కాలువలో దిగి గల్లంతైన భవాని భక్తుడు
తణుకు మండలం తేతలికి చెందిన భవాని భక్తుడు మంగళవారం రాత్రి స్నానానికి కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాజా దుర్గాప్రసాద్ (23) స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భవాని మాల ధరించిన ఆయన అత్తిలి కాల్వలో స్నానానికి దిగి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.