News January 27, 2025
తణుకులో ముఖ్యమంత్రి పర్యటన వాయిదా

సీఎం చంద్రబాబు నాయుడు తణుకు పర్యటన వాయిదా పడింది. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ఇటీవల కలెక్టర్తో పాటు ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే అనివార్య కారణాల వలన సీఎం పర్యటన వాయిదా పడినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం తెలిపారు. కూటమి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ప్రకటించారు.
Similar News
News December 12, 2025
తూ.గో: షార్ట్ ఫిలిం తీసేందుకు పోలీసుల ఆహ్వానం

వివిధ విభాగాలలో షార్ట్ ఫిలిం తీసే ఔత్సాహికులకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆహ్వానం పలుకుతున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు నాలుగు విభాగాలపై షార్ట్ ఫిలిం తీయనున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్నెస్పై దరఖాస్తులు ఆహ్వానించారు. విజేతలకు రూ.10 వేలు నగదు అందజేస్తారు. డిసెంబర్ 25లోగా పంపాలని, 6 నిమిషాల నిడివి ఉండాలన్నారు.
News December 12, 2025
రాజమండ్రి: పెట్రోల్ దొంగతనం చేస్తున్నాడని హత్య.. జైలు

కడియానికి చెందిన రాయ వెంకన్న, నల్లి శేఖర్లకు 7 సం.లు జైలు శిక్ష, రూ. 5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 సెప్టెంబర్లో కడియం (M) M. R పాలేనికి చెందిన శీలం సంతోశ్ (13) మోటారు సైకిళ్లలో పెట్రోల్ చోరీ చేస్తున్నాడనే నెపంతో వెంకన్న, శేఖర్ కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీనిపై జిల్లా జడ్జి గంధం సునీత శిక్ష ఖరారు చేశారు.
News December 12, 2025
“తూర్పు” కలెక్టర్ కీర్తి చేకూరికి 13వ ర్యాంకు

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తన పని తీరుతో ఎపీలో 13వ ర్యాంక్ పొందారు. గత 3 నెలల వ్యవధిలో కలెక్టర్లు పరిశీలించిన ఫైళ్ల క్లియరెన్స్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గ్రేడ్స్ ప్రకటించింది. ఇందులో తూర్పు కలెక్టర్ కీర్తి.. ఫైల్ పరిశీలనకు సగటున 1 రోజు 21 గంటల సమయం తీసుకున్నారు. కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ 21, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ 26వ స్థానాల్లో నిలిచారు.


