News February 10, 2025
తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు

తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.
Similar News
News October 24, 2025
నర్సాపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నర్సాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నరసాపురం ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నరసాపురం పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.
News October 24, 2025
పెనుగొండ: గంజాయి కలిగి ఉన్న యువకులు అరెస్ట్

పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ వద్ద గంజాయితో ఉన్న ఐదుగురు యువకులను పెనుగొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెనుగొండకు చెందిన సాయి నాగేంద్ర, దుర్గాసాయి, చందు, దానేశ్వరరావు, సిద్ధాంతానికి చెందిన సాయిరాంను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై గంగాధర్ తెలిపారు.
News October 24, 2025
రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.


