News February 10, 2025
తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు

తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.
Similar News
News March 7, 2026
6 వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లావ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి అవకాశాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ ప్రచార లక్ష్యమని తెలిపారు.
News March 6, 2026
ఆక్వా రైతుల నమోదును వేగవంతం చేయాలి: జేసీ

జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఆక్వా ఫీడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.