News August 30, 2024

తణుకు క్రీడాకారిణిని అభినందించిన సీఎం

image

ఇటీవల ఒలింపిక్స్‌‌లో పాల్గొన్న తణుకు పట్టణానికి చెందిన క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతికశ్రీకి శాలువా కప్పి అభినందించి జ్ఞాపిక అందజేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో మరింత రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Similar News

News September 14, 2024

చింతలపూడి: ‘ఉపాధి హామీ పనులు ప్రారంభించండి’

image

ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్విను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని కోరారు. అనంతరం ఉపాధి పనుల వివరాలను కలెక్టర్‌కు సమర్పించారు. గ్రామాల్లో ప్రజలు వలస వెళ్లకుండా ఉపాధి హామీ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు కేటాయించాలని కోరారు.

News September 13, 2024

17 నుంచి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

image

ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. స్వచ్ఛతా కి భాగీదారి ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ నెల 17న మానవహారం, 20న మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలన్నారు.

News September 13, 2024

పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3.07కోట్లు మంజూరు

image

జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు కింద రూ.3.07కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు. సింగిల్ విండో పథకం కింద అనుమతులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు. ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్‌లో అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.