News February 12, 2025

తణుకు: బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు ఇవే…!

image

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన తణుకు మండలం వేల్పూరులో కోళ్లఫారం నుంచి 10 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్టెడ్‌ ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. తణుకు మండలంలోని తణుకుతోపాటు కొమరవరం, యర్రాయిచెరువు, మండపాక, తేతలి, ఇరగవరం మండలం ఇరగవరం, కావలిపురం, రేలంగి, అర్జునుడుపాలెం, అత్తిలి మండలంలో గుమ్మంపాడు, పాలి, బల్లిపాడు, పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామాలను ప్రకటించారు. చికెన్, గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు.

Similar News

News March 15, 2025

హిందీ వివాదం: పవన్ కళ్యాణ్‌కు DMK MP కనిమొళి కౌంటర్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు TN CM స్టాలిన్ సోదరి, DMK MP కనిమొళి కౌంటర్ ఇచ్చారు. భాషాపరమైన అడ్డంకులు లేకుండా సినిమాలు చూసేందుకు టెక్నాలజీ సాయపడుతుందని పేర్కొన్నారు. గతంలో ‘హిందీ గోబ్యాక్!’ ఆర్టికల్‌ను షేర్ చేస్తూ పవన్ పెట్టిన ట్వీట్, నిన్న ‘తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు’ అని ప్రశ్నించిన వీడియో స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. BJPలో చేరక ముందు, చేరాక అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

News March 15, 2025

అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు అభినందనలు: కలెక్టర్ ప్రతీక్

image

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూములను ఇచ్చి సహకరిస్తున్న రైతులకు తగు న్యాయం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం హకీంపేట రైతులకు సర్వే నంబర్ 252లో 55.35 ఎకరాల భూమి ఇచ్చిన 31 మంది రైతులకుఅధికారులతో కలిసి కలెక్టర్ నష్టపరిహార చెక్కులను అందజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు.

News March 15, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.-

error: Content is protected !!