News January 31, 2025
తణుకు: రాత్రంతా నిద్ర పోకుండా..!

తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ పెనుగొండకు రానున్నారు. ఈ పర్యటనలో మూర్తి బందోబస్తు విధులు నిర్వహించాల్సి ఉంది. ఏదో విషయమై మదనపడుతూ నిన్న రాత్రంతా ఆయన నిద్రపోకుండా కుటుంబ సభ్యులతో గడిపారని తెలుస్తోంది. ఉదయాన్నే పెనుగొండకు వెళ్లాల్సిన ఎస్ఐ తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకున్నారు.
Similar News
News December 9, 2025
వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.
News December 9, 2025
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.
News December 9, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపు: DMHO

పెద్దపల్లి జిల్లా ఆరోగ్య శాఖలో జరిగిన సమీక్షలో డా. వి. వాణిశ్రీ ఆసుపత్రి ప్రసవాలను పెంచాలని, ప్రతి ఫుల్ టర్మ్ గర్భిణీని ట్రాక్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించారు. యాంటీబయోటిక్స్ను అవసరం ఉన్నప్పుడే వాడాలని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్సి డి స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.


