News December 21, 2024
తణుకు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) బైక్పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 22, 2024
ఉండి: ఆ ఇద్దరూ దొరికితే వీడనున్న చిక్కుముడి
ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళ ఇంటికి డెడ్బాడీ పార్శిల్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఎందుకు పార్శిల్ చేశారనేది ఉత్కంఠగా మారింది. కాగా తులసి మరిది సిద్ధార్థ వర్మే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తులిసి, ఆమె చెల్లికి ఉన్న ఆస్తి తగాదాలే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. ఆటోలో మృతదేహాన్ని పార్శిల్కు అప్పగించిన మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
News December 22, 2024
ఏలూరు: యువతి తండ్రిని చిత్రహింసలు పెట్టి చంపాడు
ఏలూరు జూట్ మిల్లు సమీపంలో ఈ నెల 14న జరిగిన వెంకట కనకరాజు హత్య కేసు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కనకరాజుని హత్య చేస్తే అతని కూతురిని పెళ్లి చేసుకోవచ్చని నిందితుడు మామిడి నాని(23) భావించినట్లు పోలీసులు తెలిపారు. పదునైన చెక్కతో కనకరాజుని చిత్రహింసలు పెట్టి చంపినట్లు చెప్పారు. నానిపై గతంలోనూ ఓ మర్డర్ కేసు ఉందని, మరో హత్యాయత్నం కేసులోనూ నిందితుడని పేర్కొన్నారు.
News December 22, 2024
తణుకు: నుజ్జునుజ్జైన BODY.. మృతుని వివరాలివే
తణుకులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. శనివారం తణుకు హైవేలో బైక్పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెరవలి మండలం అన్నవరప్పడికి చెందిన వ్యాపారి సుబ్రహ్మణ్యం(45) మరణించాడు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.