News October 8, 2024

తణుకు: స్నానానికి కాలువలో దిగి గల్లంతైన భవాని భక్తుడు

image

తణుకు మండలం తేతలికి చెందిన భవాని భక్తుడు మంగళవారం రాత్రి స్నానానికి కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాజా దుర్గాప్రసాద్‌ (23) స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భవాని మాల ధరించిన ఆయన అత్తిలి కాల్వలో స్నానానికి దిగి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Similar News

News February 27, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.

News February 27, 2026

కలెక్టరుకు చాక్‌పీస్‌ మైక్రోఆర్ట్‌ బహూకరణ

image

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

News February 27, 2026

ఉండి: RRR ను పరామర్శించిన సినీనటుడు మోహన్‌బాబు

image

క్రీడా పోటీల్లో గాయపడి, ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోహన్ బాబు, రఘురామ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.