News September 25, 2024

తత్కాల్ ద్వారా ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం: డీఈవో

image

అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో ఈనెల 25, 26న చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు పరీక్ష ఫీజుతోపాటు పదవ తరగతికి అదనంగా 500, ఇంటర్ కు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవలో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News October 6, 2024

MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు

image

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.

News October 6, 2024

సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు

image

సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

News October 6, 2024

దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం

image

కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.