News March 16, 2025

తపాలా శాఖ ద్వారా భద్రాచలం రామయ్య తలంబ్రాలు

image

పోస్టాఫీస్ ద్వారా భద్రాచలం రామయ్య పరోక్ష సేవలు అందించటానికి తపాలా శాఖ సిద్ధమైంది. శ్రీ సీతారాముల కళ్యాణం, మహాపట్టాభిషేకంలో స్వయంగా పాల్గొనలేని భక్తులు సమీప పోస్టాఫీస్‌కు వెళ్లి అంతరాలయ అర్చన, తలంబ్రాలకు రూ.450, ముత్యాల తలంబ్రాలకు రూ.150 చొప్పున చెల్లించి పూర్తి వివరాలతో దరఖాస్తు అందజేయాలని, ఇంటికే చేరవేస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News February 18, 2026

భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

image

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.

News February 18, 2026

కేంద్రీయ విద్యాలయంలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు రూరల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్, కార్యాలయ సిబ్బంది పోస్టులకు అర్హులైన వారు kothuru.kvs.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూలను ఈ నెల 23, 24న తేదీల్లో నిర్వహించనున్నామని చెప్పారు.

News February 18, 2026

నేరేడు పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

నేరేడు చెట్లకు ఫిబ్రవరి ఆఖరు నుంచి లేదా మార్చి తొలి వారంలో నీటి వసతిని ఏర్పాటు చేసుకుంటే పూత రాలకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన పూత రాలుతున్నట్లు గమనిస్తే 15 లీటర్ల నీటిలో ప్లానోఫిక్స్ అనే మందు 3 గ్రాములను కలుపుకొని ఒకసారి పిచికారీ చేయాలి. దీని వల్ల పూత రాలడం తగ్గి, పిందె కట్టడానికి, పిందె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ నాణ్యత పెంచడానికి కూడా ఈ మందు కొంత సాయం చేస్తుంది.