News September 7, 2024
తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లా: బండిసంజయ్

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని కేంద్రమత్రి బండి సంజయ్ HYDలో అన్నారు. నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం TG, APకి కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఇదీ రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
HYD: మూడు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే ప్లాన్

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని గాంధీభవన్ వర్గాలు నేతలకు దిశానిర్దేశం చేశాయి. జూబ్లీహిల్స్ గెలుపు స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను వివరించాలని అధిష్ఠానం సూచించింది. అధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి, నగర రాజకీయాలపై పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
News January 3, 2026
HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.
News January 3, 2026
BIG BREAKING: HYDలో పోరాటానికి సిద్ధమైన BRS

GHMC డీలిమిటేషన్ మీద BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్తో విభజన చేయడం ఏంటని నిలదీస్తున్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ సాధించేందుకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని తలసాని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. జంట నగరాలను ఇష్టం వచ్చినట్లు విడదీసి, ప్రజల మనోభావాల తోటి ఆడుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు BRS పోరాటం చేస్తుందని తలసాని పేర్కొన్నారు.


