News March 3, 2025
తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు

తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. మధుర నగర్కి చెందిన షేక్ బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (RI)పై కేసు నమోదు చేసి తప్పుడు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 22, 2025
విజయవాడ: దుర్గగుడిలో పాముకాటుకి గురైన భక్తుడు

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో పాము కలకలం రేపింది. క్యూలైన్లో ఓ భక్తుడు అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా పాము కాటు వేసింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా వర్షాలు పడటంతో కొండపై నుంచి పాములు వస్తున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ రెండు పాములు రాగా.. ఓ పాము డోనర్స్ సెల్ దగ్గర వున్న భక్తుడిని కాటు వేసింది. విష సర్పం కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.