News October 18, 2024
తప్పుడు రాతలు రాస్తే వదిలిపెట్టేది లేదు: లోకేశ్

ఇప్పటికైనా సాక్షి దినపత్రిక తన వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హితువు పలికారు. విశాఖ కోర్టులో హాజరైన అనంతరం మాట్లాడుతూ.. తప్పుడు రాతలు రాస్తూ దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వం, టీడీపీ, పార్టీ నాయకులు వదిలిపెట్టరని హెచ్చరించారు. 2019-2024 వరకు ఆ పత్రిక రాసిన అనేక అవాస్తవాలు, తప్పుడు రాతలను రుజువు చేయలేకపోయిందని అన్నారు.అందుకనే వైసీపీని ప్రజలు తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 21, 2025
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
News October 21, 2025
వ్యాపారులు డస్ట్ బిన్లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.
News October 21, 2025
సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా సుజాత

సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం జోనల్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న సుజాతకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న త్రినాథరావు రిలీవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.