News August 19, 2024
తప్పులు చేస్తూ పోలీసులపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు: SHO

నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేయించడమే కాకుండా, పోలీసులు వేధిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఢిల్లీవాలా స్వీట్ హోమ్ పై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం స్వీట్ హోమ్ ముందు ప్రధాన రహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలను తీయించే విషయంలో పోలీసులతో యాజమాన్యం గొడవపడి వారే పోలీసులపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.
Similar News
News October 30, 2025
NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. పాక్షికంగా కొన్ని గేట్లు ఎత్తివేత.!

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R. బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.
News October 30, 2025
నిజామాబాద్: పశు సంవర్ధక శాఖ సేవలు మెరుగు పరచాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయం మినీ కాన్ఫరెన్సు హాల్లో ఆయన పశు సంవర్ధక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశు సంపద కలిగిన రైతులకు అవసరమైన సేవలు అందించేలా పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 29, 2025
NZB: నా వెనుక ఎవరూ లేరు: ఎమ్మెల్సీ కవిత

తాను ఇండిపెండెంట్ నని, తన వెనుక ఎవరు లేరని, తన ముందు ప్రజలు ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయన్నారు. తన నడక ద్వారా తన స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుందని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. తాను ఒక పని పెట్టుకుంటే ఆ కమిట్ మెంట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు.


