News February 12, 2026

తమిళనాడులో ఇన్‌స్టాగ్రామ్ ఎలక్షన్స్!

image

తమిళనాడులో అటు నేతలు, ఇటు జెన్ జీ ఎలక్షన్స్ ఎదుర్కొంటున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటూ ఆకట్టుకునే ప్రకటనలు, ప్రామిస్‌లు చేస్తుంటే, తాము ఆ మీటింగుల్లో ఉన్నామంటూ యువత ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వైరల్ కావడంపై ఫోకస్ పెట్టింది. నేతలతో సెల్ఫీ, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఇన్‌స్టాలో రీల్స్ చేయడం, మిగతా వారికంటే ఎంత వేగంగా వైరల్ అవుతున్నామో చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారట.

Similar News

News March 16, 2026

షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

image

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్‌లైన్‌లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్‌ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.

News March 16, 2026

వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

image

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)

News March 16, 2026

INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

image

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.