News August 12, 2024
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ప్రకాశం వాసులు సేఫ్
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు రాగా జిల్లాలో విషాదం నెలకొంది. దీంతో చెన్నై SRMలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులంతా ఆందోళన చెందారు.<<13831591>> ప్రకాశం వాసులు చనిపోలేదని<<>>, పొదిలికి చెందిన కొల్లూరు చైతన్యకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
Similar News
News September 16, 2024
స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌గా ఏల్చూరు మహిళ
ఈ నెల 14, 15వ తేదీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన 11వ ఏపీ అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన కుమారి నంద పాల్గొని 2 పతకాలు సాధించారు. ఈమెను పలువురు అభినందించారు.
News September 16, 2024
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని ఎస్పీ దామోదర్ చెప్పారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న కొందరికి వివిధ మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వగా, మరికొందరిని వీఆర్‌కు బదిలీ చేశారు.
News September 16, 2024
చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్
చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.