News June 11, 2024
తమిళనాడు మాజీ CMకు విశాఖ ఎంపీ ఆహ్వానం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా.. విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు కేటాయించిన హోటల్‌కు తీసుకువెళ్లారు.
Similar News
News March 20, 2025
విశాఖలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

విశాఖ జిల్లాలో గురువారం నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం తెలిపారు. రేపటి నుంచి మార్చి 22 వరకు, మార్చి 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఆధార్ క్యాంపుల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో ఆధార్ సేవలు అందుతాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 19, 2025
విశాఖ స్టేడియం ఆవరణలో నిరసన చేస్తాం: గుడివాడ

మధురవాడలో గల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైయస్సార్ పేరు తొలగించడం అన్యాయమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. విశాఖలో వైసీపీ ఆఫీసులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ స్టేడియంకు YSR పేరును తొలగించడం పట్ల నిరసనగా స్టేడియం ఆవరణలో వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
News March 19, 2025
స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలి: కలెక్టర్

ఏప్రిల్ 30న సింహాచలంలో జరిగే చందనోత్సవంకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూలైన్లలో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈఓను ఆదేశించారు.