News April 2, 2025
తలంబ్రాల బుకింగ్లో ఉమ్మడి కరీంనగర్ రికార్డు

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 15, 2025
MBNR: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులకు గడువు పెంపు

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటన ద్వారా వెలడించారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. వివరాలకు 77309 09838 నంబర్ సంప్రదించాలన్నారు.
News November 15, 2025
రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

రైలులో తక్కువ ధరకే వస్తువులను <
News November 15, 2025
మక్తల్లో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి అండర్–14 క్రికెట్ ఎంపికలు

మక్తల్ లో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలను నిర్వహించేందుకు క్రీడా శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా ప్రోత్సాహం చూపుతున్నారని జిల్లా క్రీడా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14 స్కూల్ గేమ్స్ క్రికెట్ ఎంపికలు మక్తల్ మినీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మొత్తం 80 మంది బాలురు వీరిలో 20 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.


