News April 2, 2025
తలంబ్రాల బుకింగ్‌లో ఉమ్మడి కరీంనగర్ రికార్డు

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News September 18, 2025
BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
మంచిర్యాల: ‘నిబంధనలకు ఉల్లంఘిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి’

తాండూరు మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సెయింట్ థెరీసా పాఠశాలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఏడీ లలితకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల బుధవారం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. వెంటనే పాఠశాలను సీజ్ చేసి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.
News September 18, 2025
VJA: వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ

SRR & CVR కళాశాలలో వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో వెబ్సైట్ రూపకల్పనపై శిక్షణ ఇస్తామని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు దీనికి హాజరు కావొచ్చన్నారు. వివరాలకై APSSDC ట్రైనింగ్ కో ఆర్డినేషన్ అధికారి నరేశ్‌ను సంప్రదించాలని కోరారు.