News April 2, 2025
తలంబ్రాల బుకింగ్‌లో కరీంనగర్ రికార్డు

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 19, 2025
విద్యుత్ కాంతులతో ముస్తాబైన కలెక్టరేట్

దీపావళి పర్వదినం సందర్భంగా కలెక్టర్ కార్యాలయాన్ని అధికారులు విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలో కలెక్టరేట్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో విరజిల్లుతోంది. అంతకుముందు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు పేల్చాలని సూచనలు చేశారు.
News October 19, 2025
HOT TOPIC: మావోయిస్టులతో నేతల సంబంధాలు?

TG: కొంత మంది రాజకీయ నాయకులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారన్న బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మావోయిస్టుల సాయుధ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తున్నారని, వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో సంబంధాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. దీంతో ఆ నేతలెవరనే చర్చ మొదలైంది.
News October 19, 2025
CM రాక.. బోనంతో స్వాగతం

ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆదివారం వైభవంగా సాగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలో CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి ధర్నాచౌక్ ప్రాంగణానికి చేరుకున్న ఆయన కాన్వాయ్ డోర్ ఓపెన్ చేసి మహిళా కళాకారులకు అభివాదం చేశారు. నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తున్న కళాకారుల్లో CMని చూసి ఉత్సాహం మరింత పెరిగింది.