News April 6, 2024

తలమడుగులో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి శివారులోని అంతర్రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పిప్పల్‌ గావ్‌కు చెందిన భోపాల్, ఈశ్వర్, అంకుశ్ బైక్‌పై ఉపాధి కోసం సుంకిడికి బయలుదేరారు. ఎదురుగా వస్తున్న మ్యాక్స్ పికప్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ముగ్గురిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 14, 2025

BREAKING: అప్పుడే పుట్టిన శిశువును పడేసిన తల్లి

image

సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఏ తల్లి కన్నదో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువును చూసి స్థానికులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

సంక్రాంతి పండగపూట బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. కాగజ్‌నగర్‌కు చెందిన రాజేశ్ HYDలో మెకానిక్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. టూ టౌన్ SI మహేందర్ కథనం ప్రకారం.. రాజేశ్ తన భార్య, కుమారుడితో కారులో మంగళవారం కాగజ్‌నగర్ వెళ్తున్నారు. బెల్లంపల్లి గంగారంనగర్ హైవేపై లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడి భార్య రేణుక(30) అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాలపాలైన రాజేశ్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.

News January 14, 2025

జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం

image

సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.