News June 20, 2024

తలమడుగులో 2 చిరుతల సంచారం

image

తలమడుగులో 2 చిరుతలు సంచరిస్తున్న విషయం కలకలం రేపింది. కుచులపుర్ గ్రామంలోని ఆశన్నకు చెందిన ఎద్దుపై మంగళవారం చిరుత దాడి చేసింది. మామిడి శేఖర్ అనే వ్యక్తి బుధవారం మేకలను మేపడానికి కొత్తూరు శివారులోని అడవికి వెళ్లాడు. అక్కడ మేకలపై చిరుతలు దాడి చేయడం చూసి గ్రామస్థులకు సమాచారం అందించాడు. FBO అవినాశ్, DYRO రన్వీర్, మండల పశు వైద్యులు డా.దూద్ రామ్ ఘటన స్థలానికి చేరుకొని చిరుతల అడుగులను గుర్తించారు.

Similar News

News February 23, 2026

నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

image

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2026

తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

image

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

News February 22, 2026

కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.