News July 14, 2024

తలమడుగు: చిరుతపులి దాడిలో మేక మృతి

image

తలమడుగు మండలంలోని కొత్తూరు శివారులో చిరుతపులి దాడిలో మేకపోతు మృతి చెందింది. స్థానికుల వివరాలు.. బాతురి మల్లేశ్ మేకల మందను శనివారం మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. చిరుత పులి దాడి చేసి మేకను హతమార్చింది. దీని విలువ రూ.10 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కాగా.. గత 15 రోజుల క్రితం మేకల మందపై దాడి చేయగా కాపరుల అరుపులతో చిరుతపులి విడిచిపెట్టి వెళ్లింది.

Similar News

News October 13, 2024

ADB: ఎంబీబీఎస్‌లో సీటు.. విద్యార్థికి రూ.50 వేల సాయం

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరపగూడకు చెందిన పూనం అశోక్ MBBSలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విద్యార్థిని శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా మెస్రం దుర్గం, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపాదేవ్, తదితరులు పాల్గొన్నారు.

News October 12, 2024

నిర్మల్: పండగపూట విషాదం

image

దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత్ పేట్‌కు చెందిన పోలీస్ బొర్రన్న (50)మృతి చెందాడు. దిలావర్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రన్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతణ్ని 108లో నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడన్నారు.

News October 12, 2024

మంచిర్యాల: క్రీడాకారులకు ఘన స్వాగతం

image

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ మహిళల జట్టు శనివారం మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా జట్టు, కోచ్ అరవింద్ కు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేష్, కోశాధికారి అలుగువెళ్లి రమేష్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు.