News March 19, 2024

తలమడుగు: పురుగుల మందు తాగి వ్యక్తి SUICIDE

image

తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశరెడ్డి (55) అనే రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంట దిగుబడి రాక.. బ్యాంకు అప్పులు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.

Similar News

News September 14, 2024

BREAKING: మంచిర్యాల జిల్లాలో విషాదం

image

మంచిర్యాల జిల్లాలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాసిపేట మండలం దేవాపూర్‌లో ఇద్దరు యువకులను ఓ పాము కాటేసింది. గ్రామస్థులు గమనించగా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే యువకుడు నవీన్ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

image

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.950 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 966 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాల్‌ల ద్వారా 870, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

News September 14, 2024

ADB: గ్యాస్ సబ్సిడీ ఖాతాలో జమకావడం లేదా

image

రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో భాగంగా రూ.500లకు LPG సిలిండర్‌ను అందజేస్తుందని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపికై సిలిండర్ పొందిన వారికి ఆధారిత ఆన్‌లైన్ బదిలీ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ చేస్తున్నట్లు తెలిపారు. ఖాతాలో డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు.