News November 10, 2024
తలమడుగు: మద్యం మత్తులో వాగులో దూకి ఆత్మహత్య

మద్యం మత్తులో వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన ఆర్.నాగన్న (40) మద్యానికి బానిస అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మద్యం మత్తులో స్థానిక సుంకిడి బ్రిడ్జి పై నుంచి నీటిలో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలి: ADB SP

బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి సూచించారు. గురువారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలన్నారు. పట్టణంలో బీట్ సిస్టం సక్రమంగా అమలు చేయాలని, దీని ద్వారా నేరాల నియంత్రణ దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని వివరించారు.
News November 27, 2025
ఎన్నికలకు అవసరమైన బందోబస్తు సిద్ధం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం సన్నద్ధమైందన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని సూచించారు.
News November 27, 2025
ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత: ADB కలెక్టర్

జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాజకీయ పార్టీ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.


