News August 19, 2024

తల్లంపాడు కిట్స్ కళాశాల సమీపంలో రోడ్డుప్రమాదం

image

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు కిట్స్ కళాశాల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం జీళ్ళచెరువుకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా కుమ్మరి కుంట్ల మహేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Similar News

News September 13, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో వారంతపు సెలవులు కాగా, 16న వినాయక నిమజ్జనం, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 18వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.

News September 13, 2024

TGSRTC డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్ సమీక్ష

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ గురువారం రీజనల్ కార్యాలయంలో అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాల వల్ల క్యాన్సిల్ అయిన బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దసరా స్పెషల్ ఆపరేషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపోలో ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్‌లు, గ్యారేజ్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

News September 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే