News February 3, 2025

తల్లాడలో ఆకట్టుకుంటున్న ఫ్లెక్సీ 

image

రైతుకష్టపడితేనే.. అందరికీ పంచభక్ష్యం.. అని రాసివున్న రాజకీయ ఫ్లెక్సీ రైతులు, వాహనాదారులను ఆకట్టుకుంటోంది. తల్లాడ మండలం అంజనాపురం సమీపంలో రైతు నలజాల శ్రీనివాసరావు తన మొక్కజొన్న పంటలో రాజకీయ నాయకుల ఫోటోలతో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో రైతు కష్టం చెబుతూనే తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Similar News

News November 3, 2025

పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హెడ్ మాస్టర్‌లు, మున్సిపల్ కమీషనర్‌లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.

News November 3, 2025

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

News November 2, 2025

సెలవులపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. నేటి నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించనున్నారు.