News March 19, 2024

తల్లితండ్రులను పట్టించుకోకుంటే కేసులు: కలెక్టర్

image

తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారకాతిరుమల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏలూరులో కలెక్టర్‌ను ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురానికి చెందిన చిట్టెమ్మ కలిసి తన బాధను తెలిపి, న్యాయం చేయాలని కోరింది. తన కుమారుడు నిరాదరణకు గురిచేస్తున్నాడని, ఎటువంటి ఆధారం లేదని, న్యాయం చేయాలని కోరింది.

Similar News

News February 4, 2025

ప.గో: తీర ప్రాంత పిల్లలపై శ్రద్ద పెట్టాలి..కలెక్టర్

image

తీర ప్రాంత గ్రామాల పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టర్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరికలు పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై డీఈవో, నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.

News February 3, 2025

ప.గో. అందుబాటులో ఇసుక: కలెక్టర్

image

జిల్లా ప్రజల అవసరాలకు స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచిన ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేనందున జిల్లా స్థాయి ఇసుక కమిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీపర్రు-2 ఇసుక రీచ్ నుండి ఇసుకను ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాలకు తరలించి, స్టాక్ పాయింట్లో అమ్మకాలు చేపట్టామన్నారు.

News February 3, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలపై  డీఆర్వో సమీక్ష

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్‌ను రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. భీమవరం కలెక్టరేట్‌లో డిఆర్ఓ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై తూర్పు, ప. గో.జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, మోడల్ కోడ్ గురించి వివరించారు. జిల్లాలో 69,884 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారన్నారు.