News February 27, 2026

తల్లిదండ్రులకు ఆయేషా అవశేషాలు

image

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసును ఆధారాలు లభించలేదన్న కారణంతో సీబీఐ కోర్టు ఇటీవల కొట్టివేసిన <<19197966>>విషయం<<>> తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ సీబీఐ కోర్టు ఆమె అవశేషాలను కుటుంబసభ్యులకు అప్పగించింది. తన కుమార్తె అవశేషాలను తండ్రి కన్నీళ్లతో మోసుకెళ్లగా కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేడు విజయవాడలోని శ్మశాన వాటికలో వాటిని ఖననం చేయనున్నారు.

Similar News

News April 20, 2026

8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

News April 20, 2026

రహానే చెత్త రికార్డు

image

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్‌(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.