News August 1, 2024

తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా అధికారి

image

శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బి.మీనాక్షి గురువారం శ్రీకాకుళంలోని ఆమె కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి 7వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. సంబంధిత అధికారులు ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ర్యాలీలు నిర్వహించి, ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తారన్నారు.

Similar News

News January 23, 2026

రాష్ట్రపతితో విందుకు సిక్కోలు విద్యార్థినికి ఆహ్వానం

image

శ్రీకాకుళం మండలం ఇప్పిలి జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇప్పిలి సంజనకు రాష్ట్రపతితో విందు చేసేందుకు ఆహ్వానం అందింది. శుక్రవారం పాఠశాల హెచ్ఎం సుజాత ఈ విషయాన్ని చెప్పారు. విద్యార్థిని సంజన గత మూడేళ్లుగా ప్రాజెక్టులు తయారు చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు పంపిస్తోంది. ఆమె తయారు చేసిన డ్యూయల్ సోలార్ ట్రాకర్ సిస్టం ప్రాజెక్ట్ ఆ సంస్థను ఆకర్షించింది. ఈమె ప్రతిభను గుర్తించి ఈ అవకాశం కల్పించింది.

News January 23, 2026

SKLM: నేడు అలరించనున్న ప్రత్యేక షోలు ఇవే

image

➤మధ్యాహ్నం 2గం నుంచి డై&నైట్ కూడలి నుంచి అరసవల్లి వరకు శోభాయాత్ర
➤సాయంత్రం 5గం.సాక్సోఫోన్, శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఆరోహి మ్యూజికల్ అకాడమీ షోలు
➤రాత్రి 7గం.నుంచి జబర్దస్త్ టీమ్ తో కామెడీ షో, ఢీ డాన్సర్స్ బృందంతో నృత్యాలు
➤ జానపద గీతాలు ఆలాపన
➤అద్భుతమైన లేజర్, డ్రోన్ షో
ఈ కార్యక్రమాల గురించి అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

News January 23, 2026

SKLM: ప్రతి 10ని.లకు ప్రత్యేక బస్సు

image

రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 25న RTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పల నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, విశాఖ, విజయనగరం, రాజాం, పాలకొండ, బత్తిలి, శ్రీముఖలింగం, పాతపట్నం, టెక్కలి, పలాస నుంచి సాధారణ ఛార్జీలతో నడుస్తాయన్నారు. ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు.