News March 17, 2025
తల్లి దశదినకర్మ రోజే విగతజీవిగా తనయుడు

మంగోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దశదినకర్మ రోజే తనయుడు విద్యుత్ ఘాతంతో విగతజీవిగా మారాడు. వివరాలిలా.. ముదిరాజ్ కాలనీకి చెందిన కొండ సత్తెవ్వ దశదినకర్మను కులసంఘం భవనంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమపనుల్లో సమగ్నమైన కొడుకు కృష్ణభవనం ఎదురుగా ఉన్న ఇంట్లో బట్టలు ఆరవేస్తున్న సమయంలో కరెంట్షాక్కు గురై గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Similar News
News December 4, 2025
పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఆన్లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
News December 4, 2025
దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.
News December 4, 2025
కల్వకుర్తి: కొనసాగుతున్న ఏకగ్రీవాల జోరు

కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజకవర్గంలోని రెండు మండలాలలో ఆరు గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వెల్దండ మండలంలోని బండోని పల్లి, చౌదరిపల్లి, కేస్లీ తాండ, కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట, జీడిపల్లి తండా, వెంకటాపూర్ తండాల పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవంతో స్థానిక నాయకులు పట్టు నిలుపుకున్నారు.


