News August 7, 2024
తల్లి పాలు అమృతం లాంటివి: కలెక్టర్ పమేలా సత్పతి
తల్లి పాలు అమృతం లాంటివని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి తల్లి పిల్లలకు జన్మనిచ్చిన 24 గంటల లోపు కచ్చితంగా ముర్రు పాలను పట్టించాలన్నారు. దాని వల్ల తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.
Similar News
News September 20, 2024
కరీంనగర్: తీరనున్న గల్ఫ్ కష్టాలు!
ఎట్టకేలకు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికుల సమస్యలపై సలహా కమిటీ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యత, డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. కాగా, ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లకు చెందిన యువత గల్ఫ్ బాట పట్టారు.
News September 20, 2024
ఇల్లంతకుంట: బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.
News September 20, 2024
జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష
రాబోయే ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకు సంభందించి వివిధ శాఖల అధికారులతో గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ప్యాడి క్లీనింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టోకెన్ పద్ధతి పాటించాలని సూచించారు.