News February 27, 2025
తల్లి మందలించిందని బాలుడి సూసైడ్

కంచరపాలెం సమీపంలోని కేవీ స్కూల్లో 9వ తరగతిచదువుతున్న దాసరి ఎర్రినిబాబు తన ఇంట్లో మేడపై బాత్రూంలో నైలాన్ తాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సెలవు కావడంతో ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి ఎర్రినిబాబును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సాయంత్రం మేడ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 27, 2025
విశాఖలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

విశాఖలో గురువారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగాయి. జిల్లాలోని 13 కేంద్రాల్లో 87.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
News February 27, 2025
విశాఖ మెడికల్ స్టోర్ ముందే కుప్పకూలిపోయాడు

విశాఖలోని డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీశారు. అతని వద్ద కేవలం మందుల చీటీ తప్ప మరే ఆధారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 27, 2025
KGHలో శిశువుల మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివానంద్ దీనిపై స్పందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.