News April 15, 2025

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ మనదే: KMR ప్రోగ్రాం అధికారి

image

కామారెడ్డిలోని రాజీవ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డా.అనురాధ మంగళవారం సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ గదులను పరిశీలించారు. రిజిస్టర్లను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ఆరోగ్య సిబ్బందిదేనని ఆమె అన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలపై సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News November 20, 2025

అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?

image

AP: నిధులు జమకాని రైతులు annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌లో Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. ఆధార్ నంబర్, పక్కన క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అందిన మొత్తం, తేదీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సక్సెస్ అంటే డబ్బు జమైందని అర్థం. Pending/Rejected అంటే ఇంకా జమ కాలేదు, నిరాకరించబడిందని అర్థం. మీకు ఏమైనా సందేహాలుంటే గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.

News November 20, 2025

సిద్దిపేట: అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజిపేట బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 5 నెలల క్రితం గజ్వేల్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన యువతి సదా అఫ్రీన్ (21), అలిరాజపేట గ్రామానికి చెందిన ఫరీద్ (22) అనే యువకుడు ఇద్దరు డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకుంన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 20, 2025

మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

image

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.