News April 15, 2025

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ మనదే: KMR ప్రోగ్రాం అధికారి

image

కామారెడ్డిలోని రాజీవ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డా.అనురాధ మంగళవారం సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ గదులను పరిశీలించారు. రిజిస్టర్లను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ఆరోగ్య సిబ్బందిదేనని ఆమె అన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలపై సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News July 9, 2025

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. ABVP ప్రస్థానమిదే!

image

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 77వ వసంతంలోకి అడుగు పెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగమైన ఈ సంస్థను 1949 జులై 9న ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ‘రాష్ట్రీయ ఛత్ర దివస్’ (జాతీయ విద్యార్థి దినోత్సవం)గా కార్యకర్తలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులలో జాతీయవాద భావనను పెంపొందించడం, విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ABVP పనిచేస్తోంది.

News July 9, 2025

దేవీపట్నంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

దేవీపట్నం మండలం పెద్దవుర గ్రామానికి చెందిన మిర్తివాడ రమణారెడ్డి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడని అతని సోదరి వీరవేణి తెలిపారు. యానాం సమీపంలో కోనవానిపాలెం గ్రామంలో రొయ్యల చెరువు వద్ద వారం రోజుల కిందట కూలి పనికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడన్నారు. యజమాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరుడి మృతిపై అనుమానం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 9, 2025

HYD: 2023 ప్రతిభ పురస్కారాలు.. ఎంపికైంది వీరే

image

ఎలనాగ(కవిత), ప్రభల జానకి(విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం), సంపత్ రెడ్డి(శిల్పం), రమేశ్ లాల్(నృత్యం), హరిప్రియ(సంగీతం), ప్రతాపరెడ్డి(పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ(నాటకం), పాపయ్య(జానపద కళ), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), మలయవాసిని(ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ(నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. వీరికి 19న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.