News July 22, 2024
తహశీల్దార్లను రిలీవ్ చేసిన కర్నూలు కలెక్టర్

ఎన్నికల నేపథ్యంలో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ రంజిత్ బాషా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లాకు వచ్చిన 29 మంది తహశీల్దార్లను సొంత జిల్లాలకు పంపుతూ రిలీవ్ చేశారు. ఆయా మండలాల్లో డిప్యూటీ తహశీల్దారులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించాలని ఆదేశాలను జారీ చేశారు.
Similar News
News November 12, 2025
రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
News November 12, 2025
ఈనెల 14న ఉమ్మడి జిల్లాస్థాయి విలువిద్య ఎంపిక పోటీలు

ఉమ్మడి కర్నూలు జిల్లా విలువిద్య ఎంపిక పోటీలను కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి కె.నాగరత్నమయ్య బుధవారం తెలిపారు. అండర్-21 బాలబాలికల విభాగంలో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు కృష్ణా(D) నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు.
News November 12, 2025
కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.


