News January 30, 2025

తహశీల్దార్లు, సర్వేయర్లతో నెల్లూరు జేసీ సమీక్ష

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పలు రకాల భూసమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నెల్లూరు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News February 23, 2025

నెల్లూరులో చికెన్ ధరలు ఇవే..

image

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చికెన్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బ్రాయిలర్ ధర రూ.93 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.190గా ఉంది. అదే విధంగా లేయర్ చికెన్ ధర రూ.127గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మీ ఊరిలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 23, 2025

నేడు నెల్లూరుకు రానున్న CM

image

CM చంద్రబాబు ఆదివారం నెల్లూరుకు రానున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.10 గంటలకు కనుపర్తిపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు హెలీకాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి గొలగమూడి సమీపంలోని వీపీఆర్‌ కన్వెన్షన్‌లో టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి హెలీప్యాడ్‌ చేరుకుని 2.15 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు.

News February 23, 2025

నెల్లూరు:‘ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించండి’

image

మార్చి 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ అన్నారు. శనివారం డీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారుల శిక్షణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్ఐఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 53,200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు.

error: Content is protected !!