News June 28, 2024

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నేడు వారు మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను, ధరణి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణి మాడ్యూల్ సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ డి.రాంప్రసాద్, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.

Similar News

News December 24, 2025

ప్రమాదాల్లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాను వచ్చే ఏడాది రహదారి ప్రమాదాల్లేని జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News December 24, 2025

గాంజాపై సమరం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి: నల్గొండ కలెక్టర్

image

విద్యార్థులు గాంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ అధికారుల సమన్వయంతో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.

News December 24, 2025

నకిలీ వైద్యులకు కేరాఫ్ నల్గొండ

image

జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండతోపాటు DVK, MLG, అనుముల, NKL, చిట్యాల, చండూరు తదితర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో జిల్లాలో నకిలీ వైద్యుల బాగోతం బయటపడింది. నకిలీ వైద్యులపై జిల్లా వైద్య శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.