News January 24, 2025
తాండూరులో ఈ నెల 28 నుంచి ఉచిత ధ్యాన శిక్షణ

ఈనెల 28 నుంచి 3 రోజులపాటు తాండూర్లో ఉచిత ధ్యాన శిక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ పరమేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. 15 ఏళ్లు పైబడిన వారందరూ ధ్యాన శిక్షణకు హాజరు కావాలని కోరారు.
Similar News
News January 9, 2026
ఈ కామర్స్ సైట్లో డొంక లాగితే.. HYDలో మాంజా దొరికింది

నగరంలో ప్రమాదకర మాంజాను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నగర పోలీసు విభాగానికి చెందిన ఓ SI చేపట్టిన డెకాయ్ ఆపరేషన్తో ఈ మాంజా విక్రయాలు ఈ కామర్స్ సైట్ల ద్వారాను జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా సైట్లలోని క్రయవిక్రయాలను ఆరా తీసిన పోలీసులు కొందరికి నోటీసులు జారీ చేశారు. చైనా మాంజాపై సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ కోరారు.
News January 9, 2026
‘రాజాసాబ్’ పార్ట్-2.. టైటిల్ ఇదే

‘రాజాసాబ్’ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పార్ట్-2 టైటిల్ను ‘రాజాసాబ్ సర్కస్: 1935’గా ఖరారు చేసినట్లు మూవీ ఎండింగ్లో వెల్లడించారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్లో కనిపించనున్నారు. అయితే ఇది ప్రీక్వెలా లేదా సీక్వెల్గా తెరకెక్కుతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్లతో పాటు ప్రభాస్ ఓల్డేజ్ లుక్ సీన్లు పార్ట్-1లో లేవు. అవి పార్ట్-2లో ఉంటాయేమో.
News January 9, 2026
BREAKING: చెరువుగట్టు జాతర తేదీల ప్రకటన

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అతిపెద్దదైన చెరువుగట్టు జాతరకు శుభ ముహూర్తం వచ్చేసింది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి 30 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్ బాబు ప్రకటించారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు కలెక్టర్ అధ్యక్షతన, స్థానిక MLA ఆధ్వర్యంలో ఇవాళ మ.1:30 గంటలకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. SHARE IT


