News January 24, 2025
తాండూరులో ఈ నెల 28 నుంచి ఉచిత ధ్యాన శిక్షణ

ఈనెల 28 నుంచి 3 రోజులపాటు తాండూర్‌లో ఉచిత ధ్యాన శిక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ పరమేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. 15 ఏళ్లు పైబడిన వారందరూ ధ్యాన శిక్షణకు హాజరు కావాలని కోరారు.
Similar News
News February 12, 2025
మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.
News February 12, 2025
మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.
News February 12, 2025
జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లు.. ప్లానేంటో?

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ వంటి పిచ్‌లపై స్పీడ్ స్టార్లను వదిలేసి వరుణ్, కుల్దీప్, రవీంద్ర, అక్షర్, సుందర్ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాయంతో బుమ్రా దూరమవ్వగా శార్దూల్, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి మీ కామెంట్?