News February 28, 2025
తాండూరులో యాక్సిడెంట్.. తండ్రి కళ్లముందే కొడుకు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లముందే కొడుకు మృతిచెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. తాండూరులో చెంగోల్ బైపాస్ వద్ద తండ్రి, కొడుకు వెళ్తున్న స్కూటీని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కొడుకు నర్సింలు స్కూటీ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి గోపయ్యకు గాయాలయ్యాయి. గోపయ్యకు తాండూరు ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
Similar News
News November 28, 2025
PDPL: ‘ప్రతి కళాశాల నుంచి 50 మంది హాజరు కావాలి’

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రతి కళాశాల నుంచి కనీసం 50 మంది అభ్యర్థులు హాజరుకావాలని ఆదేశించారు. టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కళాశాలలు కోఆర్డినేటర్ను నియమించాలని, విద్యార్థుల నైపుణ్యాలపై అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసుకోండి!

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్ను<<>> అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్లో ‘Aadhaar’ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.
News November 28, 2025
పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటిని డ్రైవ్ మోడ్లో క్లియర్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు.
లాగిన్లో అర్జీలు పెండింగ్లో ఉన్నాయంటూ మండల సర్వేయర్, తహశీల్దార్లను కలెక్టర్ ప్రశ్నించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


