News April 11, 2025

తాండూరులో రేపు మాంసం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరులో రేపు మాంసం దుకాణాలు బంద్ పాటించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాలతో పట్టణంలోని చికెన్, మటన్, ఫిష్ మాంసం దుకాణాల వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. శనివారం పట్టణంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించాలని తెలిపారు. దుకాణాలే కాకుండా హోటల్స్, రెస్టారెంట్లులో ఎక్కడా మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులో తెలిపారు.

Similar News

News April 19, 2026

ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు

image

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాలు, వివిధ అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వారోత్సవాల నిర్వహణలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

News April 19, 2026

ADB: మొక్కజొన్న కొనుగోలుకు 11 కేంద్రాలు

image

మొక్కజొన్న కొనుగోలుకు ఆదిలాబాద్ జిల్లాలో 11 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పలు కేంద్రాలను ప్రారంభించామని.. మిగతా కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైతులు తమ పంటను బయటి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా, తమ మొక్కజొన్న పంటను చెత్తచెదారం లేకుండా తేమ 14% మించకుండా షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.

News April 19, 2026

IPL: అద్భుత విజయం

image

IPL-2026: గెలుపు అసాధ్యం అనుకున్న దశలో KKR అద్భుత విజయం సాధించింది. RR నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత వరుసగా వికెట్లు కోల్పోయింది. 70కే 5 వికెట్లు పడిన దశలో రింకూ (53*), అనుకుల్ రాయ్ (29*) బౌండరీలతో మ్యాచును గెలిపించారు. వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో KKRకు ఇదే తొలి విజయం.