News March 6, 2025

తాండూరు: ఇంటర్ పరీక్ష హాల్లో పాము

image

తాండూరులో ఇంటర్మీడియట్ సెకండ్‌ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా పరీక్షా హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు పరుగులు తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలోని ఏ బ్లాక్ రూం నంబర్ 3లో పాము ప్రత్యక్షమైంది. కేకలు వేస్తూ విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. పామును కొట్టి చంపేశారు.

Similar News

News December 10, 2025

నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

News December 10, 2025

దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

image

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.