News March 6, 2025
తాండూరు: ఇంటర్ పరీక్ష హాల్లో పాము

తాండూరులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా పరీక్షా హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు పరుగులు తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలోని ఏ బ్లాక్ రూం నంబర్ 3లో పాము ప్రత్యక్షమైంది. కేకలు వేస్తూ విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. పామును కొట్టి చంపేశారు.
Similar News
News March 25, 2025
శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు: ఎస్పీ

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జరగనున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మంగళవారం తెలిపారు. ప్రత్యేకించి క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News March 25, 2025
రేపు వైసీపీ ఇఫ్తార్ విందు

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.
News March 25, 2025
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

TG: రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ 3 నుంచి 4 ఎకరాల్లోపు అన్నదాతల ఖాతాల్లో రూ.200 కోట్ల డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు రిలీజ్ చేసినట్లయ్యింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4,666.57 కోట్లు అందించింది. ఈ నెలాఖరులోపు రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.