News January 24, 2025

తాండూరు ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు

image

ఓపెన్ స్కూల్లో 2024-2025 పదవ తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్ తీసుకొనుటకు ఈ నెల 27 నుంచి 29 వరకు తత్కాల్ స్కీం కింద ప్రత్యేక అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 20, 2025

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.

News November 20, 2025

ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్‌ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.

News November 20, 2025

ప్రకాశం: రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాలో 1392 రేషన్ షాపుల ద్వారా 651820 రేషన్ కార్డుదారులకు రేషన్ అందుతోంది. ఇటీవల జిల్లాలో ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. అయితే సచివాలయ సిబ్బంది, డీలర్లు ఇప్పటివరకు 592800 స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 59020 కార్డులను లబ్ధిదారులు తీసుకోవాల్సిఉంది. ఈనెల 30లోగా కార్డులను స్వీకరించకుంటే, వెనక్కుపంపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.