News April 3, 2024
తాండూరు: ‘ప్రేమ పేరుతో భార్యను వేధించాడని చంపేశాడు’

తాండూరులోని సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ <<12972348>>హత్యకు గురైన<<>> విషయం తెలిసిందే. అతడి ఫోన్ సిగ్నల్స్ ద్వారా IBలోని ఓ కాలనీకి చెందిన దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. మార్చి 31 రాత్రి అజ్గర్‌ను ఇంటికి పిలిచి తలపై రాడ్డుతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. తన భార్యను అజ్గర్ ప్రేమ పేరుతో వేధించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఆ ముగ్గురిని ASF సబ్ జైలుకు తరలించారు.
Similar News
News April 19, 2026
సప్లిమెంటరీ అభ్యర్థులకు స్పెషల్ కోచింగ్: ADB DIEO

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం 20 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని DIEO జాదవ్ గణేశ్ కుమార్ ఆదేశించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు సమన్వయంతో విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
News April 19, 2026
ADB: రేపటి నుంచి OPEN టెన్త్, ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యాసకులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, కేవలం పెన్, ప్యాడ్ మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News April 19, 2026
ADB: రీ కౌంటింగ్, వెరీఫికేషన్ దరఖాస్తుకు రేపే ఆఖరు

ఇంటర్మీడియట్ విద్యార్థులు రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు అవకాశం ఉందని DIEO జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, రీ-వెరిఫికేషన్ కోసం రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. విద్యార్థులు http://tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.


