News December 25, 2024

తాండూరు మండలంలో పులి సంచారం.. ?

image

తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 13, 2025

బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI

image

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

News January 13, 2025

ADB: ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

image

నార్నూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2025 సంవత్సరానికి 100 సీట్లకు ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలో 7 తరగతి నుంచి 9వ తరగతిలో మిగిలిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షకోసం అర్హులైన విద్యార్థులు https Telangana ms.cgg.giv.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 12, 2025

జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్‌లో పర్యటించిన హైకోర్టు జడ్జి

image

కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పెళ్లి రేంజ్ అడవులలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణహైకోర్టు జడ్జి రాధారాణి కుటుంబ సమేతంగా పర్యటించారు. ముందుగావారికి పోలీసులు అటవీ శాఖ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జంగల్ సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లి అందాలను తిలకించారు. అటవీ అధికారులువారికి అన్ని ఏర్పాట్లు చేశారు.